ETV Bharat / state

రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రైతులకు శుభవార్తను అందించారు మంత్రి హరీశ్​రావు. రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల చేశారు. సిద్దిపేట, హుస్నాబాద్‌, సిరిసిల్ల నియోజకవర్గాలకు సాగునీరు అందనుంది.

రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల
రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల
author img

By

Published : Feb 17, 2021, 1:19 PM IST

రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల చేశారు. చిన్నకోడూరు మం. చందలపూర్‌లో పరిధిలో నీటిని మంత్రి హరీశ్​రావు విడుదల చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా చిన్నకోడూరువాసులకు తొలిసారి యాసంగికి నీరునందించారు.

ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కల అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరంతో ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మధన్యమని వెల్లడించారు. యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగు నీరు అందిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో సాగునీటి వెతలకు సీఎం శాశ్వత పరిష్కారం చూపారని వ్యాఖ్యానించారు.

ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చిందని హరీశ్ వివరించారు. ఒకనాడు తాగేందుకు గుక్కెడు నీళ్లులేని దుస్థితిలో ఉన్నామని గుర్తు చేశారు. కేసీఆర్‌ ముందుచూపుతో యాసంగికి నీళ్లిచ్చే స్థితికి చేరుకున్నామని వ్యాఖ్యానించారు. సిద్దిపేట, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలకు ఈ సాగునీరు అందనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.