కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ శ్రీరామ్ ప్రతాప్ చేయూనందించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన శ్రీరామ్ సొంత డబ్బులతో 100 పల్స్ ఆక్సిమీటర్లను అందించేందుకు ముందుకు వచ్చారు. స్నేహితుల ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిమీటర్లు అందజేశారు.
సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఖర్చుచేసి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటున్నానని ప్రతాప్ అన్నారు. దుబ్బాకలో సైతం మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. కరోనాపై పోరులో దుబ్బాకకు చెందిన ఎన్నారై తన వంతు సహాయాన్ని అందించడం హర్షనీయమని మంత్రి హరీశ్ రావు శ్రీరామ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గుడికందుల రాజేందర్ రెడ్డి, కిషన్, బాల్ రెడ్డి, కృష్ణ, శ్రీహరి, తదితరులు, పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం