ETV Bharat / state

చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తా: హరీశ్​రావు - భాజపా నేతలపై మండిపడ్డ మంత్రి హరీశ్​రావు వార్తలు

సోలిపేట రామలింగారెడ్డి మృతితో తన బాధ్యత మరింత పెరిగిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సిద్దిపేట జిల్లా చెల్లాపూర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

minister harish rao participated in a meeting at chellapur in siddipet district
చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తా: హరీశ్​రావు
author img

By

Published : Oct 31, 2020, 10:20 PM IST

నా చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ బాధ్యత తాను తీసుకున్నందున... కాంగ్రెస్, భాజపా నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో చెల్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు భాజపా కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

భాజపా నేతలు తమ అబద్ధపు మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కావాలనే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. భాజపా నేతల తీరు నచ్చకే కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. ఆస్తి పన్ను వడ్డీ రాయితీ పథకం నవంబర్ 15కు పొడగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.