కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్లో వరి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కొండపోచమ్మ జలాశయం ద్వారా రైతులు రెండు పంటలకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని.. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది