ETV Bharat / state

ఇక సిద్దిపేటలో అన్ని రకాల వైద్య పరీక్షలు : హరీశ్​రావు - Telangana news

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు.

అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక సిద్దిపేటలోనే: హరీశ్​రావు

author img

By

Published : Feb 2, 2021, 8:08 PM IST

తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు.

డయాగ్నోస్టిక్ ద్వారా అందే సేవల తీరుతెన్నుల గురించి వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ... మంత్రికి వివరించారు. రోగుల సహాయకుల విశ్రాంతి గదిని మంత్రి ప్రారంభించారు. ఏ వ్యాధి నిర్ధరణ పరీక్షలైన ఇక్కడే నిర్వహించనున్నట్లు హరీశ్​రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తొలి డయాగ్నోస్టిక్ హబ్ సిద్దిపేటలోనే ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. పేదవారు వైద్య పరీక్షల మీద వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని... ఆ బాధలను తప్పించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

రూ. 2.50 కోట్లతో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. గతంలో వైద్య పరీక్షలకు హైదరాబాద్​కు వెళ్లేవారని ఇపుడా ఆ అవసరం లేదని పేర్కొన్నారు. గంటలో 1,600 పరీక్షలు... రోజుకు 35 వేల పరీక్షలు చేసే సామర్థ్యం సిద్దిపేట డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రానికి ఉందని మంత్రి ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.