ETV Bharat / state

సిద్దిపేటలో తొలిసారిగా మానవ వ్యర్థాల ప్లాంటు: హరీశ్​రావు - చెత్త ప్లాంటును ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట రూరల్ మండలంలో మంత్రి హరీశ్​ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బుస్సాపూర్​లో నిర్మించిన తడి, పొడి వ్యర్థాలను వేరుచేసే కేంద్రాన్ని, ప్లాస్టిక్ నుంచి ఇటుకలు తయారుచేసే యంత్రాన్ని, పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ప్రారంభించారు.

సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు

author img

By

Published : Feb 3, 2021, 9:53 AM IST

మానవ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రంలో మొదటి సారిగా సిద్దిపేటలో ప్లాంట్​ను నిర్మించామని మంత్రి హరీశ్​రావు అన్నారు. సెప్టిక్​ట్యాంక్​ నుంచి తీసుకొచ్చిన వ్యర్థాల నిర్వహణకోసం రూ.2.25కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. భవిష్యత్తులో అన్ని మున్సిపాలటీలోను ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యర్థాల నుంచి వచ్చిన ఎరువులను రైతులు తీసుకెళ్లే విధంగా తయారుచేయాలని సూచించారు. నీటిని పార్కులోని చెట్లకు మళ్లించాలన్నారు.

అనంతరం ప్లాస్టిక్ ద్వారా ఇటుకలు తయారుచేసే యంత్రాన్ని ప్రారంభించారు. వీటిని ఇంటి నిర్మాణంలోను, పార్కింగ్​ ప్రదేశాల్లోను ఉపయోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: రైతు ఏడిస్తే కేసీఆర్​ తట్టుకోలేరు: ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.