Harish Rao Praises Kcr: ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు నీటికి కష్టాలు పడిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు సాగునీటిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలిచామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రంగనాయకసాగర్ ఎడమ కాలువకు మంత్రి... నీటిని విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడు. తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించారు, సాధించారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ప్రజల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. గుక్కెడు తాగునీటి కోసం తల్లడిల్లిన తెలంగాణ.. ఇవాళ సాగునీటితో సస్యశ్యామల తెలంగాణగా, ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంది. అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నింటా తెలంగాణ... దేశానికి దిక్సూచిగా నిలిచింది. మరి ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గతేడాది రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లొదిలాం. మళ్లీ ఈ ఏడాది ముఖ్యమంత్రి జన్మదినం నాడు ఎడమకాలువకు నీళ్లొదలడం సంతోషంగా ఉంది. ఈ నీళ్లు.. సిద్దిపేట, సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గానికి కూడా చేరుకుంటాయి. రైతుల విజ్ఞప్తిపై ఎడమ కాలువకు నీళ్లొదులుకోవడం సంతోషంగా ఉంది. - హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇదీ చూడండి : KTR At Kandlakoya IT Park: కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ వచ్చేదా: కేటీఆర్