ETV Bharat / state

'నదికి కొత్త నడక నేర్పిన ఘట్టం గజ్వేల్​లో ఆవిష్కృతం కానుంది' - తెలంగాణ తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్​లో సీఎం కేసీఆర్​ మంగళవారం పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి హరీశ్​రావు పరిశీలించారు.

kcr gajeel tour, telangana news
harish rao, CM KCR tour
author img

By

Published : Apr 5, 2021, 8:01 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్​ మంగళవారం పర్యటించనున్నారు. కొండపోచమ్మ జలాశయం నుంచి వర్గల్ నవోదయ వద్ద సంగారెడ్డి కాలువకు... పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్​రావు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్​రావు

నదికి కొత్త నడక నేర్పిన అపూర్వ ఘట్టం మంగళవారం గజ్వేల్​లో ఆవిష్కృతమవుతుందని హరీశ్​రావు పేర్కొన్నారు. రైతుల దశ దిశ మార్చే సందర్భం ఇదన్నారు. హల్వి మంజీర నుంచి నిజాంసాగర్​లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాంలు గోదావరి నీటితో జలకళను సంతరించుకుంటాయని హరీశ్​రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ జలాలతో వేసవిలో14,268 ఎకరాల వరి పంటను కాపాడుకోగలమని తెలిపారు.

నీటి విడుదల చేసే ప్రాంతంలో హరీశ్​రావు
అధికారులతో కలిసి పరిశీలిస్తున్న హరీశ్​రావు

సీఎం కేసీఆర్​ పర్యటన వివరాలు:

  • ఉదయం 10:30 గంటల నుంచి 12:30 వరకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటన.
  • ఉదయం 10:30 గంటలకు వర్గల్ మండలం ఆవుసులోని పల్లి వద్ద హల్ది వాగు కాలువలోకి గోదావరి జలాలు విడుదల చేస్తారు.
  • ఉదయం 11:15 గంటలకు మర్కుక్ మండలం పాములపర్తి వద్ద గోదావరి జలాలను గజ్వేల్​ కాలువకు విడుదల చేస్తారు.

ఇదీ చూడండి: రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.