ETV Bharat / state

దుబ్బాకలో తెరాస గెలుపు ఖాయం.. రెండో స్థానంలో ఎవరుంటారో..: హరీశ్​రావు

author img

By

Published : Oct 7, 2020, 8:21 PM IST

దుబ్బాకలో తెరాస గెలుపు ఖాయమని.. రెండో స్థానంలో ఎవరుంటారో చూడాలని హరీశ్​ రావు అన్నారు. గతంలో ఎప్పుడూ దుబ్బాక రాని ఉత్తమ్​కుమార్​రెడ్డి, కాంగ్రెస్​ నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. హరీశ్​ సమక్షంలో చీకోడు, మిరుదొడ్డి, గొడుగుపల్లి ఎంపీటీసీలు తెరాసలో చేరారు.

minister harish rao hopes on trs victory in dubbaka bypoll
దుబ్బాకలో తెరాస గెలుపు ఖాయం.. రెండో స్థానంలో ఎవరుంటారో..: హరీశ్​రావు

దుబ్బాక ఉపఎన్నికలో తెరాస గెలుపు ఖాయమైందని మంత్రి హరీశ్​రావు జోస్యం చెప్పారు. 99 శాతం మంది దుబ్బాక ప్రజలు తెరాసలోనే ఉన్నారన్నారు. గతంలో ఎప్పుడూ దుబ్బాక రాని కాంగ్రెస్​ నేతలు, ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇప్పుడు వస్తున్నారని.. వచ్చి ఏంచేస్తారని ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్​లో చీకోడు, మిరుదొడ్డి, గొడుగుపల్లి ఎంపీటీసీలు, పలువురు మంత్రి హరీశ్​రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ఎమ్మెల్సీ ఫార్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ పార్టీ 50 ఏళ్లుగా అధికారంలో ఉందని మంత్రి హరీశ్​ అన్నారు. ఒక ఇంటికి తాగునీరివ్వలేదని.. ఒక ఎకరానికి సాగునీరివ్వలేదని విమర్శించారు. దుబ్బాక పెద్ద చెరువు కట్ట చూడమని.. ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులు చూడమని ఉత్తమ్​కుమార్​రెడ్డికి హరీశ్​ సూచించారు.

దుబ్బాకలో తెరాస గెలుస్తుందని నమ్మకం ఉందని.. రెండు స్థానంలో ఎవరుంటారో చూడాలని హరీశ్​ అన్నారు. రామలింగారెడ్డి సతీమణి.. సుజాతను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.

ఇవీచూడండి: నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.