ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో లబ్ధిదారులకు మంత్రి వివిధ వాహనాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక శక్తిగా ఎదగాలని తెలిపారు.
త్వరలోనే పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే 50 శాతం మంది లబ్ధిదారులకు చెక్కులు అందించామని.. రానున్న రోజుల్లో అందరూ లబ్ధి పొందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!