ETV Bharat / state

అప్పు లేకుండానే సొంతింటి కల సాకారం: హరీశ్ - సిద్దిపేట కేసీఆర్​ కాలనీలో రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ

ఎలాంటి అప్పు లేకుండానే... పేదవారి సొంతింటి కల సీఎం కేసీఆర్​తో సాకారమవుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ సిద్దిపేట కేసీఆర్​ కాలనీలో 168 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

minister harish rao distribute double bed room houses in siddipeta kcr colony
అప్పు లేకుండానే సొంతింటి కల సాకారం: హరీశ్
author img

By

Published : Dec 27, 2020, 2:44 PM IST

రెండు పడక గదుల ఇళ్లు పేద ప్రజల కల అని రాష్ట్ర ఆర్థికశాక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట కేసీఆర్​ కాలనీలో 168 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. ఉద్యోగి ఇల్లు కట్టుకున్నా... ఎంతో కొంత అప్పు అవుతుంది కానీ... ఖర్చు లేకుండానే పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్​ సాకారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మనిషి జీవితంలో ముఖ్యమైన ఇల్లు, పెళ్లికి ప్రభుత్వ సాయం చేస్తోందని హరీశ్​ అన్నారు. అనర్హులు ఇల్లు తీసుకుంటే... మరో పేదవాడికి అన్యాయం చేసినట్టేనన్నారు. తనను, కేసీఆర్​ను, ప్రభుత్వాన్ని విమర్శించే భాజపా కార్యకర్తలకు కూడా ఇల్లు వచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఇల్లు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కొత్త యంత్రాలు.. సొగసుకు అద్దెను మెరుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.