Minister Harish Rao: వడ్లు కొనమంటే నూకలు తినమని కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నూకలు తినమని అవమానపరిచిన భాజపా ప్రభుత్వానికి నూకలు చెళ్లేలా చేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి భాజపా నాయకులు మాట్లాడాలన్నారు. కేంద్రంలో 15లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న మంత్రి హరీశ్.. దమ్ముంటే వెంటనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. బండిసంజయ్‌కు దమ్ముంటే పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి.. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయించాలని మంత్రి హరీశ్ సవాల్ చేశారు.
నూకలు చెళ్లేలా చేయాలి..
కేంద్ర ప్రభుత్వాన్ని వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. నూకలు తినమని అవమానపరిచిన భాజపా ప్రభుత్వానికి నూకలు చెళ్లేలా చేయాలి. కొంటే కొను లేకుంటే లేదని చెప్పు. అంతే కానీ నూకలు తినమంటున్నరు. మీరు కొనకపోతే కేసీఆర్ చూసుకుంటరు. రేపు రాబోయే ఎన్నికల్లో భాజపా సర్కారుకు నూకలు చెల్లనున్నాయని హెచ్చరిస్తున్నా. -హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి
ఇదీ చదవండి: