ETV Bharat / state

తెరాస గెలిస్తేనే అభివృద్ధి: మంత్రి హరీశ్​రావు - dubbaka elections latest news

దుబ్బాకలో తెరాస అధికారంలోకి వస్తేనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్​​రావు పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా రాయపోల్​, దౌల్తాబాద్​ మండలాల్లో నిర్వహించిన ప్రచారాల్లో ఆయన పాల్గొన్నారు.

Minister Harish Rao campaigned in Raipol and Daulatabad
తెరాస గెలిస్తేనే అభివృద్ధి: మంత్రి హరీష్​రావు
author img

By

Published : Nov 1, 2020, 3:47 PM IST

Updated : Nov 1, 2020, 4:38 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్​, దౌల్తాబాద్​ మండలాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చి.. డప్పు చప్పుళ్లు, బోనాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.

భాజపా అబద్ధాల పునాదులపై అసత్య ప్రచారం నిర్వహిస్తోందని మంత్రి విమర్శించారు. భాజపా నేతలు జూట మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా దుబ్బాకలో తెరాస గెలిస్తేనే.. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భాజపా, కాంగ్రెస్​ నేతల డబ్బులకు మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి.. 'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

Last Updated : Nov 1, 2020, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.