సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెరాస కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోహెడ ప్యాక్స్ ఛైర్మన్ దేవేందర్ రావు.. మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెందిన 130 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ప్రజల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు మంత్రి హరీశ్ రావు.. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవేందర్ కోరారు. రానున్న రోజుల్లో పార్టీలో ఉన్నత పదవులు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Paddy In Water:ఎడతెరిపి లేని వర్షం... తడిసి ముద్దవుతున్న ధాన్యం