Harish Rao Comments: ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 700 మెడికల్ కళాశాల సీట్లు ఉండేవని.. ఏడేళ్లలో 2,840కి పెరిగాయని మంత్రి తెలిపారు. రాబోయే రెండేళ్లలో 5,240కి పెంచుతామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రేడియాలజీ హబ్‌ను జడ్పీ ఛైర్మన్ రోజాశర్మతో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఏంహెచ్ఓ కాశీనాథ్, ఇతర వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
"ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం. పీహెచ్‌సీలకు గుండెనొప్పితో వస్తే ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలు అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నాం. అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేలా తెస్తున్నాం.హైదరాబాద్ జంట నగరాల్లో అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్‌లు ప్రారంభిస్తున్నాం. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రికి, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దు. ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలి. 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే.. ఇవాళ 7 ఏళ్లలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నాం. రాష్ట్రంలోని 8 చోట్ల మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభం చేయనున్నాం." - హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: