కరోనా నియంత్రణకై సిద్దిపేట పట్టణం నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ అన్నారు. కొవిడ్ కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదని, అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని.. అలా వచ్చిన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యోగా, వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగా ఉంటున్నారని.. అందరూ యోగ చేయాలని కోరారు. సిద్దిపేటకు వివిధ పనుల కోసం వచ్చే ప్రజల కోసం పట్టణంలో మూడు చోట్ల వేడినీటి కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వేడినీరు, కషాయం తాగడం వల్ల వైరస్ మహమ్మారి నుంచి బయట పడవచ్చని, పాజిటివ్ వచ్చిన వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల