ETV Bharat / state

రెండు నూతన అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీశ్

author img

By

Published : Sep 18, 2020, 2:35 PM IST

దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నూతనంగా రెండు అంబులెన్స్​లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

రెండు నూతన అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీశ్
రెండు నూతన అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీశ్

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్​పేట గ్రామంలో కొత్త అంబులెన్స్​ , నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నిత్యం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో రెండు నూతన అంబులెన్సులను మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

108ని వినియోగించుకోవాలి..

అత్యవసర సమయాల్లో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మిరుదొడ్డి మండల ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ లక్ష్మీ, మిరుదొడ్డి పీఎసీఎస్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, అక్బర్​పేట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మాకే ఇవ్వండి : ఎరుకల సంఘం నేత మల్లీశ్వరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.