ETV Bharat / state

'దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ తెరాస జెండా ఎగరాలి'

author img

By

Published : Sep 5, 2020, 11:02 AM IST

దుబ్బాక నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మాణిక్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్​లో ఏర్పాటు చేసిన తెరాస ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

Meeting of the chief leaders of Theresa in Dubaka
'దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ తెరాస జెండా ఎగరాలి'

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో తెరాస ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళులు అర్పించారు.

దుబ్బాక నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందించిన సేవలు మరువలేనివని నేతలు పేర్కొన్నారు. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ.. నియోజకవర్గంలో తిరిగి పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఇదీచూడండి.. మా సర్కారు పథకాలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.