సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అరెపల్లెలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ప్రారంభించారు. వర్ష కాలంలో నట్టల నివారణ వలన గొర్రెల్లో రోగ నిరోధకత పెరిగి.. పునరుత్పత్తి పెరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. 1962 సర్వీస్ నెంబర్‌కి ఫోన్ చేస్తే అంబులెన్స్‌తో సహా పశు వైద్యులు వచ్చి.. జబ్బు పడిన గొర్రెలు, పశువులకు చికిత్స అందిస్తారన్నారు. ఆగస్టు నుంచి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: 'కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి'