ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో జూట్ బ్యాగుల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు జనవికాస, దేశ్‌పాండే ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మహిళల కోసం జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ముందుగా పట్టణంలోని 25 మంది మహిళలకు వారం రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని వారు తెలిపారు. జూట్ బ్యాగుల తయారీతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.