పేరున్న బ్రాండ్ల విత్తనాలు కొనుగోలు చేస్తున్నారా....తక్కువ ధరకు వస్తున్నాయని అశపడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త. పంటలు వేసే సయమం సమీపిస్తుండటంతో రైతులను బురిడీ కొట్టించి నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి, వరి విత్తనాలను విక్రయిస్తున్న చంద్రమౌళి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.3,39,460 విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.