ETV Bharat / state

చావులోనూ వీడని 'ప్రేమ' బంధం - school

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు కుదరదన్నారు. అంతే..కనీసం చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమికుల ఆత్మహత్య
author img

By

Published : May 16, 2019, 12:59 PM IST

సిద్దిపేట జిల్లా కొండపాకలో విషాదం చోటుచేసుకుంది. లకుడారం గ్రామానికి చెందిన మంజే కనకయ్య, రాచకొండ తారా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించారు. ప్రేమించిన పాపానికి రెండేళ్ల క్రితం యువకుడికి 30వేల జరిమానా విధించారు. కానీ ప్రేమికులిద్దరూ దూరంగా ఉండలేకపోయారు. కులాలు వేరు కావటం వల్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొండపాకలోని ప్రభుత్వ పాఠశాలల భవనానికి చేరుకున్నారు. ముందు విషం తాగారు. గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు వెతికారు. ఇంతలో పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

tg_srd_01_16_lovers_sucide_av_c4 రిపోర్టర్: పరశురాములు, కంట్రిబ్యూటర్, సిద్దిపేట () సిద్దిపేట జిల్లా కొండపాకలో ఇద్దరు ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...లకుడారం గ్రామానికి చెందిన మంజే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు. అయినప్పటికీ కనకయ్య ,తార ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొండపాకలోని ప్రభుత్వ పాఠశాలల భవనంలోకి వెళ్లారు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన కనకయ్య, తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాల లోని ఓ గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతుడు కనకయ్య పది రోజుల క్రితమే ఆంజనేయ స్వామి మాలను ధరించాడు. ఈ మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు......vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.