ETV Bharat / state

కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం - మల్లన్న జాతర 2021

కోరమీసాల కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణ వేడుక అట్టహాసంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడాడు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

komuravelli mallanna
komuravelli mallanna
author img

By

Published : Jan 10, 2021, 12:48 PM IST

Updated : Jan 10, 2021, 3:07 PM IST

కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన వేడుకలు మూడు నెలల పాటు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా... వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.

కల్యాణం అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు. సిద్దిపేట, గజ్వేల్‌తోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

ఇదీ చూడండి: పులుల సంచారంపై ఎంపీ సోయం సంచలన వ్యాఖ్యలు

Last Updated : Jan 10, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.