సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈరోజు పెద్దపట్నం అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండం తొక్కడాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శివసత్తులు అగ్ని గుండం నుంచి నడుచుకుంటూ పట్నం తొక్కుతే కోరుకున్న కోరికలు నెరువేరుతాయని భక్తుల విశ్వాసం. అగ్ని గుండం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ