జనవరి నెలాఖరు నాటికి కాళేశ్వరం నీళ్లు గజ్వేల్ నియోజకవర్గానికి వస్తాయని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. ప్రతి చెరువు, కుంట నిండాలని.. పంటలు పండాలని ఆకాంక్షించారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమావేశాలు పెట్టుకుందామని సూచించారు. గజ్వేల్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందామని వివరించారు. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు. దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధిని దేశ, విదేశాల నుంచి వచ్చి చూడాలని ఆకాక్షించారు. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుందామని సీఎం సూచించారు.
- కేసీఆర్ సంబంధిత స్పీచ్1: ప్రజా జీవితంలో విశ్రాంతి ఉండదు: కేసీఆర్
- కేసీఆర్ సంబంధిత స్పీచ్2: ఆడిటోరియానికి మహతి పేరు ఎందుకు పెట్టారంటే?
- కేసీఆర్ సంబంధిత స్పీచ్3: రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేస్తాం: కేసీఆర్