ETV Bharat / state

KCR Speech in Praja Ashirvada Sabha Husnabad : 'ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చే వారిని నమ్మొద్దు.. ఆలోచించి ఓటెయ్యకపోతే ఆగమవుతాం' - KCR participated BRS Praja Ashirvada Sabha

KCR Speech in Praja Ashirvada Sabha Husnabad : ఎన్నికలు వచ్చినందున కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయని కేసీఆర్ మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్‌ పార్టీ అడుగుతోందని..ఆ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. హుస్నాబాద్​లో ఆయన పార్టీ ప్రచార భేరీ మోగించారు. ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు.

kcr
kcr
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 5:41 PM IST

Updated : Oct 16, 2023, 6:58 AM IST

KCR Speech in Praja Ashirvada Sabha Husnabad ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి

KCR Speech in Praja Ashirvada Sabha Husnabad : బీఆర్ఎస్ పార్టీ ప్రచారభేరీ మోగింది. గులాబీ బాస్ తనకు అచ్చి వచ్చిన హుస్నాబాద్‌లోనే మరోసారి ఎన్నికల శంఖారావం పూరించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలని సభలో కేసీఆర్ సూచించారు. స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందని కేసీఆర్ (KCR) ప్రశ్నించారు.

KCR on Telangana Development : 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు లేదని.. రాష్ట్రం నుంచి ప్రజల వలసలు ఉండేవని కేసీఆర్ గుర్తు చేశారు. సమస్యల పరిష్కరానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేసినట్లు.. అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్‌ వన్‌గా నిలిపామని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటి రారని, పోటీ లేరని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలని కేసీఆర్ వెల్లడించారు.

CM KCR Election Campaign Schedule 2023 : 110 నియోజకవర్గాలు.. 17 రోజులు.. 41 సభలు.. ఉద్ధృత ప్రచారానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు

KCR Fires on Congress : కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయని.. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్‌ పార్టీ (Congress ) అడుగుతోందని కేసీఆర్ విమర్శించారు. హస్తం పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారని.. పదికి పైగా అవకాశాలు పొందిన ఆ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసిందని దుయ్యబట్టారు. 2014లో రూ.200 ఉన్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచామని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పింఛన్లను రెట్టింపు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఎవరూ అడగకుండానే రైతుల కోసం రైతుబంధు తెచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయిందని.. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండేదో ప్రజలను గుర్తు చేసుకోమన్నారు. ఇప్పుడు ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలటం లేదని చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నామని.. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.

KCR At Telangana National Integration Day 2023 : ''తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుచరిస్తోంది' అనేది అక్షర సత్యం'

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి. స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు లేదు, రాష్ట్రం నుంచి ప్రజల వలసలు ఉండేవి. సమస్యలు పరిష్కరానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశాం. అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్‌ వన్‌గా నిలిపాం. - కేసీఆర్, సీఎం

Telangana Assembly Elections 2023 : ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం తరలించేందుకు వేల లారీలు సరిపోతలేవని చెప్పారు. 24 గంటల విద్యుత్‌తో రైతులు కంటినిండా నిద్రపోతున్నారని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన 6 నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.

BRS Manifesto 2023 : వృద్ధులకు రూ.5016, దివ్యాంగులకు రూ.6016.. రైతుబంధు కింద రూ.16 వేల సాయం

KCR Announced Gas Cylinder for 400Rupees : రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌.. మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్‌

Last Updated : Oct 16, 2023, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.