సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే ఆలయాలకు వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ఎలాంటి తోపులాట జరగకుండా కమిటీ సభ్యులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండిః ఏన్కూరులో పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు