ETV Bharat / state

ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్​ - పట్టణ ప్రగతి కార్యక్రమం

రాజకీయాలు, వాగ్దానాలు ఎన్నికల వరకేనని.. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు.

ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్​
ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్​
author img

By

Published : Feb 27, 2020, 8:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 8, 11 వార్డులలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

రాజకీయాలు, వాగ్దానాలు ఎన్నికల మట్టుకేనని.. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని బండి సంజయ్​ సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. విమర్శలు ప్రతి విమర్శలకు తావు లేకుండా తన వంతు బాధ్యతగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని సంజయ్​ హామీ ఇచ్చారు.

ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్​

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.