సిద్దిపేట జిల్లా రాయపోల్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని అర్హులైన 52 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
పేదింటి ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఆసరాగా ఉంటోందని ఎమ్మెల్యే అన్నారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పీటీసీ సభ్యుడు లింగాయపల్లి యాదగిరి, ఎంపీపీ అల్లూరి అనిత, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసుల అదుపులో ఎంపీ రేవంత్రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత