సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్, రాయ్‌పోల్ మండలం అనాజ్‌పూర్, తిమ్మక్కపల్లికి చెందిన భాజపా యువకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు గులాబీ తీర్థం పుచ్చుకోవడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలెవరికి ఎలాంటి అవసరమొచ్చినా తాను, రామలింగన్న అండగా నిలిచామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లను పెట్టి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపామని మంత్రి తెలిపారు. ఇవన్నీ జరిగిన వాస్తవాలే కానీ కాంగ్రెస్, భాజపా లాగా కళ్లిబొల్లి మాటలు కాదని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః ఉత్తమ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు