సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సమక్షంలో కమలం పార్టీలో చేరారు. వారికి రఘునందన్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అని చెప్పిన కేటీఆర్, హరీశ్ రావు ఇప్పుడు దుబ్బాకలో సానుభూతితో ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.
కేంద్రంలో పాస్ అవ్వని బిల్లును వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహించారు. అలా చేసేవారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. భాజపా కార్యకర్తలంతా సమన్వయంతో ఉంటూ అందరినీ కలుపుకుపోవాలన్నారు. తెరాస నాయకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి భాజపాకు ఓటు వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: గెలిపిస్తే.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రఘునందన్ రావు