సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ బస్‌డిపో వద్ద కార్మికులు దీక్ష కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా ఏఐటీయూసీ సంఘీభావం తెలిపింది. తాము 43 రోజులుగా సమ్మె చేస్తున్నా, 30 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయినా కూడా ముఖ్యమంత్రికి కనికరం లేదని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఐకాసని చర్చలకు పిలచి సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు... ఎక్కడికక్కడ అరెస్టులు..