సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫేర్) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 250 రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. వాటి పనితీరును వీక్షకులకు వివరించారు.
హైడ్రాలిక్ క్రేన్, డ్రోన్, వన్య ప్రాణుల నుండి పంటలను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గంట, మ్యాగ్నెటిక్ లైట్, మంకీ గన్, గ్లోబల్ వార్మింగ్ మొదలగు నమూనాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత వివిధ నమూనాలను పరిశీలించి.. విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఇన్నారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!