ETV Bharat / state

'నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం భోజనం పెడతా'

హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​ కుమార్ ఉదారతను చాటుకున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సొంత ఖర్చుతో ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

husnabad mla vodithela sathish kumar says that he will provide mid day meals till he is mla
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
author img

By

Published : Dec 3, 2019, 8:56 AM IST

ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్​ హుస్నాబాద్​ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

ఇటీవలి మంత్రి హరీశ్​రావు హుస్నాబాద్​ పర్యటనకు వచ్చినప్పుడు.. తమకు మధ్యాహ్న భోజనం పెట్టమని విద్యార్థులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​.. నియోజకవర్గంలోని పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.

ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన నియోజకవర్గంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తానని సతీశ్​ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం వసతి గృహంలో ఉంటున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

మధ్యాహ్న భోజనం

Intro:TG_KRN_103_02_MLA_MIDDAY MEALS_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం తన సొంత ఖర్చులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు మొత్తం 2200 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. 2017 లో మంత్రి హరీష్ రావు డిగ్రీ కళాశాల కు వచ్చిన సందర్భంగా ఎందరికో అన్నం పెట్టే వొడితల కుటుంబం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఆకలి తీర్చాలని ఎమ్మెల్యేను కోరగా అందుకు స్పందించిన ఎమ్మెల్యే 800 మంది విద్యార్థులకు భోజనం పెట్టి ఆకలి తీర్చారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉండడంతో మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఇటీవల మంత్రి హరీష్ రావు హుస్నాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా మరొకసారి కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టమని కోరారు. మంత్రి హరీష్ రావు కోరిక మేరకు స్పందించిన ఎమ్మెల్యే సోమవారం డిగ్రీ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మరియు ఆదర్శ పాఠశాలల్లో నాన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనాన్ని జడ్పీ చైర్మన్ రోజా శర్మ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తానని సతీష్ కుమార్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ ఆదర్శ పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో దుప్పట్లను కూడా పంపిణీ చేశారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.