రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో స్వామి వారి ఆశీస్సులు ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కోరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. కోడె మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
చిన్న వేములవాడగా పేరుగాంచిన శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని ఆయన తెలిపారు.
ఇదీ చదంవండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ'