సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అద్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి... విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సహకారంతో కొద్ది రోజులు మధ్యాహ్న భోజనం పెట్టారని... అనంతరం పథకం అమలు చేయడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ప్రతి రోజూ పస్తులుంటూ పాఠాలు వింటున్నామని వాపోయారు. సర్కారు ఇకనైనా స్పందించి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుధాకర్ విద్యార్థినులతో మాట్లాడి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి : పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేద్దాం: హరీష్‌రావు