మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో ఒంటరిగా ఉన్నవారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిల్లలతో కాకుండా ఒంటరిగా ఉన్నవారిని కుటుంబంగా పరిగణించాలని సూచించింది. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ వాసుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
జులై 5న ధ్రువపత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. పరిహారం ఇవ్వకపోతే లిఖితపూర్వక కారణాలు తెలపాలని చెప్పింది. అప్పటివరకు పిటిషనర్లను ఖాళీ చేయించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: NGT: రాయలసీమ ఎత్తిపోతలపై విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతాం