High Court On Cinematography: రాష్ట్రంలో సినిమా ఆటోగ్రఫీ నిబంధనలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాటోగ్రఫీ నిబంధనల ఆధారంగా ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాలపై షరతులు విధిస్తూ సిద్దిపేట పోలీసు కమిషనర్ లైసెన్స్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై బై మూవీ టిక్కెట్స్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
cinematography regulations: పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ చట్టవిరుద్ధంగా గతేడాది అక్టోబరు 10 న ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయానికి లైసెన్స్ జారీ చేశారన్నారు. ఈ అమ్మకాలకు షరతులు విధించే పరిధి కమిషనర్‌కు లేదన్నారు. 50 శాతానికి మించి టిక్కెట్లను ఆన్ లైన్లో విక్రయించరాదని, రూ.6 కంటే ఎక్కువగా సర్వీసు ఛార్జీ వసూలు చేయరాదని, సినిమా ప్రారంభానికి రెండు గంటల ముందు ఆన్ లైన్లో టిక్కెట్లు విక్రయించరాదంటూ షరతులు విధించారన్నారు. ఈ షరతులు రాజ్యాంగ, చట్టవిరుద్ధమన్నారు. షరతులు విధించడానికి వీలుగా ఉన్న సినిమాటోగ్రఫీ నిబంధనలను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం 2006 నాటి సినిమా ఆటోగ్రఫీ నిబంధనలు, 2012లో హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని.. హోంశాఖ కార్యదర్శికి, సిద్దిపేట పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: