ETV Bharat / state

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం" - మాజీ మంత్రి హరీశ్​రావు

వినాయక చవితికి ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది ముఖ్యం కాదని, ఎంత శ్రద్ధగా పూజలు చేశామన్నదే ముఖ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేటలో 15వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం"
author img

By

Published : Sep 1, 2019, 4:18 PM IST

"విగ్రహ పరిమాణం కాదు.. పూజలో శ్రద్ధ ముఖ్యం"

సిద్దిపేటలో వెంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్​రావు 15వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపయ్యను పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. గణేశ్​ ఉత్సవాలల్లో జరిగే పూజల్లో కూడా ప్లాస్టిక్​ను వాడొద్దని సూచించారు. వచ్చే ఏడాదికి ప్రతి ఇంటికి ఒక మట్టి విగ్రహం పంపిణీ చేస్తామని తెలిపారు. ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది కాదు, ఎంత శ్రద్ధగా పూజలు చేశామన్నదే ముఖ్యమన్నారు.

Intro:TG_SRD_71_01_HARISH_MATTI VIGRAHALU PAMPINI_SCRIPT_TS10058

యాంకర్: మట్టి వినాయకులు పెట్టండి పర్యావరణాన్ని కాపాడండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యావరణాన్ని కాపాడాలని చెబుతున్నారు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 15 వేల మట్టి విగ్రహాలను హరీష్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణ కాపాడాలని అని ఈ గ్రామంలో ఎంత పెద్ద విగ్రహం పెట్టాము అనేది ముఖ్యం కాదు ఎంత మంచి పూజలు చేసామన్నదే ముఖ్యం అన్నారు. తొమ్మిది రోజులు జరిగే పూజలో ప్లాస్టిక్ను ఎక్కడ కూడా వాడొద్దని హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాదిలో ప్రతి ఇంటికి పట్టణంలో మట్టి విగ్రహం పంపిణీ చేస్తామని చెప్పారు.

Conclusion:సిద్దిపేటలో గ్రీన్ క్లీన్ స్వచ్ఛత సిద్దిపేట గా మార్చుకోవాలి. దోమలు ఈగలు లేని సిద్దిపేట చేసుకోవాలి. యుద్ధాలు చేయాల్సింది పక్క దేశాల పైన కాదు ప్లాస్టిక్ పైన ఉద్యమం చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపంలో ప్లాస్టిక్ను నిషేధించిన అన్నారు. మంచి వర్షాలు పడి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయక చవితి రాష్ట్ర ప్రజలకు సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే బైటు మోజో లైవ్ ద్వారా వచ్చినది వాటిని వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.