సిద్దిపేట జిల్లా చింతమడకలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటనకు వారం రోజుల నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా... చింతమడక ప్రజలతో సీఎం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కేవలం గ్రామస్థులతో మమేకమయ్యేందుకే ముఖ్యమంత్రి వస్తున్నారని ఇతరులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు గురుకుల పాఠశాలకు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: అనిశాకే అడ్డంగా దొరికిన అనిశా కానిస్టేబుల్