ఇదీ చూడండి:మొత్తం 795 నామినేషన్లు ... నిజామాబాద్‌లో 245
తెరాస ప్రచార తార జాబితాలో హరీశ్ - harish rao
ప్రచార తార జాబితాలో హరీశ్ రావు పేరును చేరుస్తూ ఈసీకి తెరాస లేఖ ఇచ్చింది. ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్‌కు చోటు కల్పించింది.
harish
తెరాస స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి హరీశ్ రావు పేరు చేర్చారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెరాస లేఖ అందించింది. మొదట జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా 11 మంది మంత్రులు, ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రావు ఉన్నారు. అందులో హరీశ్ రావు పేరు లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ రావు పేరు చేర్చాలని కోరుతూ ఈసీకి తెరాస లేఖ ఇచ్చింది.
ఇదీ చూడండి:మొత్తం 795 నామినేషన్లు ... నిజామాబాద్‌లో 245
Intro:Body:Conclusion:
Last Updated : Mar 26, 2019, 7:18 AM IST