ETV Bharat / state

హరీశ్​రావు ఔదార్యం: చదువు చెప్పించారు... పెళ్లి జరిపించారు - తెలంగాణ వార్తలు

మంత్రి హరీశ్​రావు తన ఔదర్యాన్ని మరోసారి చాటుకున్నారు. దిన పత్రికలో వచ్చిన కథనం చూసి చలించిపోయి.. ఓ అభాగ్యురాలికి విద్యాబుద్ధులు నేర్పించారు. ఇప్పుడు ఆమెకు దగ్గరుండి పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేశారు. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు.

harish-rao-married-an-orphan
హరీష్​రావు ఔదార్యం.. చదువు చెప్పించారు, పెళ్లి జరిపించారు
author img

By

Published : Dec 24, 2020, 10:57 PM IST

తల్లిదండ్రులను కోల్పోయి ఎవరూ పట్టించుకోని ఓ అభాగ్యురాలికి విద్యాబుద్ధులు నేర్పించి, ఉపాధి కల్పించి.. ఓ ఇంటి దాన్ని చేశారు మంత్రి హరీశ్​​రావు. చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్​కు చెందిన రాజుతో సిద్ధిపేటలోని టీటీసీ భవన్​లో ఘనంగా వివాహాం జరిపించారు.

ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన మంత్రి హరీశ్​రావు, కలెక్టర్ వెంకట్​రాం రెడ్డి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాల సదనంలోని చిన్నారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తమ ఇంటి కార్యక్రమంలా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వినియోగదారుల హక్కులను ప్రభుత్వాలే కాపాడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.