Harish rao inagurates many development programmes: కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోలేరని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా గట్లమల్యాల గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ టాంక్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభం చేశారు.
అనంతరం సామూహిక గొర్రెల షెడ్ ప్రారంభించారు. షెడ్లలో లబ్ధిదారులకు సాంప్రదాయ బట్టలు బహుకరించారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎన్ఏం సబ్ సెంటరులోనే తాత్కాలిక భవనం, శాశ్వత భవనానికి రూ.2కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి నంగునూరు పెద్ద వాగులో నీళ్లు నింపుతామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించారు.
సీఎం కేసీఆర్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నంగునూరు మండల వాగు అవతలి గ్రామ ప్రజలకు మేలు చేకూరేలా దవాఖానా తెచ్చారు. మండల కేంద్రమైన నంగునూరు నుంచి ఖాతా వరకూ డబుల్ లేన్ రోడ్డు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాము. 7 చెక్ డ్యాములతో నీళ్ల ఊటలు పెరిగాయి. మండల కేంద్రంలో ఉండే పీహెచ్సీ గట్లమల్యాల గ్రామానికి తెచ్చుకున్నాము. - హరీశ్ రావు, ఆర్థిక మంత్రి
ఇవీ చదవండి :