ETV Bharat / state

కాంగ్రెస్, బీజేపీలవి మాటలు తప్ప చేతలు ఉండవు: హరీశ్‌రావు

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేసి ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

harish
harish
author img

By

Published : Mar 26, 2023, 9:22 PM IST

కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని పేర్కొన్నారు. రైతులను కేసీఆర్ ఓదారిస్తే.. బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేటలో తుంపర సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. 763మంది రైతులకు 4367స్ప్రింకర్ సెట్లను పంపిణీ చేశారు. వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10,000 ప్రకటిస్తే.. అవి చాలవని బండి సంజయ్ అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు.. తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ యాసంగిలో 56 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేశారని, అన్నపూర్ణగా పలికే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారని హరీశ్‌రావు వివరించారు.

ఆ పార్టీలవి మాటలు తప్ప చేతలు ఉండవు: కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి మాటలు తప్ప చేతలు ఉండవని హరీశ్‌రావు ఆరోపించారు. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెడితే పైసలిస్తామని బీజేపీ మెలిక పెటిందని విమర్శించారు, పక్క రాష్ట్రాల వాళ్ళు మీటర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ మీటర్లు వద్దే వద్దన్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

"సిద్దిపేటలో ఒకేరోజు 763మంది రైతులకు స్ప్రింకర్ల పంపిణీ చేశాం. రైతు కోసం ఏదైనా చేసే నాయకుడు కేసీఆర్. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతుకు రూ.10వేలు నష్టపరిహారంగా ఆర్థిక సహాయం ప్రకటించారు. రైతుబంధు, రైతు బీమా, కరెంటు ఇవన్నీ దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అన్నదాతలకు సహాయాన్ని అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మోటర్ల దగ్గర మీటర్లు పెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. పక్కరాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు." - హరీశ్‌రావు, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.