సిద్దిపేట రూరల్ మండలంలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి హరీశ్ చేతుల మీదగా గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. మంత్రితో కలిసి జెడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
అగ్రవర్ణ పేదలకు కూడా..
నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని హరీశ్ పునరుద్ఘాటించారు. నిరుపేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ పథకం వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దశల వారీగా పేదలందరికీ పట్టాలివ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనని వివరించారు.
రోహిణికి ముందే..
రావురూకుల గ్రామంలోని ఎర్ర సముద్రం, పెద్ద చెరువును రోహిణికి ముందే కాళేశ్వరం జలాలతో నింపి.. మత్తడి దూకిస్తామని మంత్రి వెల్లడించారు. రోహిణి కార్తెలోనే నార్లు పోయాలని, యాసంగి పంట ముందుకొస్తున్నదని రైతులను కోరారు. కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: 'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు'