సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో కొండపోచమ్మ జలాశయంలోకి గోదావరి జలాలను త్వరలోనే ఎత్తిపోసేందుకు అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ 72 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోయాల్సి ఉండటంతో ఒక్కొక్క మోటారు 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లు బిగించారు.
ఈ మోటార్లు తిరిగేందుకు 220 కేవీ విద్యుత్ అవసరం ఉండటంతో అదే మోతాదులో విద్యుత్తు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.