సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లిలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వచ్చిన వరద నీటితో గౌరవెల్లి కాలువ పూర్తిగా నిండింది. నీటి ఉధృతికి కాలువకు గండి పడింది. కాలువ దిగువన ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరి.. పొలాలన్ని నీట మునిగాయి.
సమాచారం అందుకున్న అధికారులు గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణ చర్యల్లో భాగంగా గండిని పుడ్చే పనులు మొదలు పెట్టారు. వరదనీటిలో పంట కొట్టుకుపోయి నష్టపోయిన రైతులు... తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'