ETV Bharat / state

'దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం' - Dubbaka development news

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో క్రైస్తవ మత పెద్దల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు.

'దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం'
'దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం'
author img

By

Published : Sep 23, 2020, 5:40 PM IST

దేశంలో క్రిస్టమస్, రంజాన్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో క్రైస్తవ మత పెద్దల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. పండుగలకు ప్రభుత్వం అధికారికంగా కొత్త బట్టలను పంపిణీ చేస్తోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు నినాదంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ అధ్యక్షుడు సత్యానందం, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, సిద్దిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, క్రైస్తవ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీఎస్​ బీపాస్​ అమలుకు త్వరలో కార్యాచరణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.