మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. వారి హామీతో కుటుంబీకులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దివ్య మృతదేహాన్ని స్వగృహానికి తీసుకు వెళ్లారు. పోలీసుల బందోబస్తు మధ్య బాధితురాలి సొంతూరైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు మృతదేహాన్ని తరలించారు.
అయితే దివ్యను హత్య చేసిన వెంకటేశ్ గౌడ్ వేములవాడ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం గజ్వేల్ పోలీసులకు నిందితున్ని అప్పగించారు.
ఇవీ చూడండి: దారుణం: గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య