సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యులు బొమ్మ శ్రీరామ్, కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి ఎనలేని సేవలు చేశారని బొమ్మ శ్రీరామ్ అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి, రాజభరణాలు రద్దు చేశారన్నారు.
దేశంలో బడుగు బలహీనర్గాలకు ఇందిరమ్మ.. ఇళ్లు నిర్మించి ఇచ్చారని చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమను కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.
ఇదీ చందవండి: ఆఫర్ ఇచ్చి నెరవేర్చనందుకు కంట్రీక్లబ్‌కు భారీ జరిమానా